Song » Nee chupulu / నీ చూపులు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Kanchana / కాంచన ,
Shaarada / శారద ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: nI cUpulu gAraDicEsenu nI navvulu pUlai pUcenu nI navvulalO A cUpulalO ninu kavviMcE vADevvaDu nA cUpulu gAraDi cEsinA nA navvulu pUlai pUsinA E okkarikO avi dakkunulE A Takkari doMgavu nIvElE caraNaM: nI mOmE oka caMdrabiMbaM dAniki muccaTaina puTTumacca aMdaM nI mOmE oka caMdrabiMbaM A aMdaM cUsi nI muMduku dUki eMdaru yuvakulu toMdarapaDi ninnettuku pOtArO nEnEmaipOtAnO nA cUpulu caraNaM: magasiri gala sogasaina doravu aMduku saripaDu siraralennOkalavu magasirigala sogasaina doravu nI pakkanamUgi tama makkuva cUsi cakkani paDucula cekkili taLukula cikkuku pOtAvO nI celinE maricEvO nI cUpulu caraNaM: ciguriMcina I anurAgaM vikasiMcunulE kalakAlaM ciguriMcina I anurAgaM nI valapE nEnai nA velugE nIvai kammani mamatala baMgaru mEDala kalalE kaMdAmA kalalE kaMdAmA A...............
పల్లవి: నీ చూపులు గారడిచేసెను నీ నవ్వులు పూలై పూచెను నీ నవ్వులలో ఆ చూపులలో నిను కవ్వించే వాడెవ్వడు నా చూపులు గారడి చేసినా నా నవ్వులు పూలై పూసినా ఏ ఒక్కరికో అవి దక్కునులే ఆ టక్కరి దొంగవు నీవేలే చరణం: నీ మోమే ఒక చంద్రబింబం దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం నీ మోమే ఒక చంద్రబింబం ఆ అందం చూసి నీ ముందుకు దూకి ఎందరు యువకులు తొందరపడి నిన్నెత్తుకు పోతారో నేనేమైపోతానో నా చూపులు చరణం: మగసిరి గల సొగసైన దొరవు అందుకు సరిపడు సిరరలెన్నోకలవు మగసిరిగల సొగసైన దొరవు నీ పక్కనమూగి తమ మక్కువ చూసి చక్కని పడుచుల చెక్కిలి తళుకుల చిక్కుకు పోతావో నీ చెలినే మరిచేవో నీ చూపులు చరణం: చిగురించిన ఈ అనురాగం వికసించునులే కలకాలం చిగురించిన ఈ అనురాగం నీ వలపే నేనై నా వెలుగే నీవై కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా కలలే కందామా ఆ...............
0 comments:
Post a Comment