Friday, July 24, 2020

Alluri Seetharama raju » Vastadu na raju      అల్లూరి సీతారామరాజు » వస్తాడు నా రాజు

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Vastadu na raju / వస్తాడు నా రాజు

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

vastADu nA rAju I rOju

rAnE vastADu nelarAju I rOju

kArtIka punnami vELalOna kaliki vennala keraTAlapaina

kArtIka punnami vELalOna kaliki vennala keraTAlapaina

tEli vastADu nA rOju I rOju
caraNaM : 1

vEla tArakala nayunAlatO nIlAkASaM tilakiMcEnu

vEla tArakala nayunAlatO nIlAkASaM tilakiMcEnu

atani callani aDugula savvaDi... vIcE gAli vinipiMcEnu

atani pAvana pAda dhULikai avani... aNuvaNuvu kalavariMcEnu

atani rAkakai aMtaraMgamE... pAlasaMdramai paravaSiMcEnu

pAlasaMdramai paravaSiMcEnu...

vastADu nA rAju I rOju

rAnE vastADu nelarAju I rOju
caraNaM : 2

vennelaleMtagA virisina gAni... caMdruNNi viDipOlEvu

keraTAleMtagA poMginagAni... kaDalini viDipOlEvu

kalasina Atmala anubaMdhAlu... E janmakU viDipOlEvulE

tanuvulu vErainA dArulu vErainA

tanuvulu vErainA dArulu vErainA

A baMdhAlE nilicEnulE... A baMdhAlE nilicEnulE

vastADu nA rAju I rOju

rAnE vastADu nelarAju I rOju

kArtIka punnami vELalOna kaliki vennala keraTAlapaina

vastADu nA rAju I rOju




 
Click here to hear the song
పల్లవి :

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

తేలి వస్తాడు నా రోజు ఈ రోజు
చరణం : 1

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

అతని చల్లని అడుగుల సవ్వడి... వీచే గాలి వినిపించేను

అతని పావన పాద ధూళికై అవని... అణువణువు కలవరించేను

అతని రాకకై అంతరంగమే... పాలసంద్రమై పరవశించేను

పాలసంద్రమై పరవశించేను...

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
చరణం : 2

వెన్నెలలెంతగా విరిసిన గాని... చంద్రుణ్ణి విడిపోలేవు

కెరటాలెంతగా పొంగినగాని... కడలిని విడిపోలేవు

కలసిన ఆత్మల అనుబంధాలు... ఏ జన్మకూ విడిపోలేవులే

తనువులు వేరైనా దారులు వేరైనా

తనువులు వేరైనా దారులు వేరైనా

ఆ బంధాలే నిలిచేనులే... ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

వస్తాడు నా రాజు ఈ రోజు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment