Song » Teluguveera Levaraa / తెలుగువీర లేవరా
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Ghantasala / ఘంటసాల ,
V.Ramakrishna / వి.రామకృష్ణ ,Song Category : Others
pallavi : OhO... hO... OhOhO... O... O.... teluguveera laevaraa... aa... deekshabooni saagaraa.... aa... teluguveera laevaraa deekshabooni saagaraa daeSamaata svaechCha kOri tirugubaaTu chaeyaraa teluguveera laevaraa deekshabooni saagaraa daeSamaata svaechCha kOri tirugubaaTu chaeyaraa charaNaM : 1 daaruNa maaraNakaaMDaku tallaDillavadduraa... aa... neetilaeni Saasanaalu naeTi nuMDi radduraa... aa... daaruNa maaraNakaaMDaku tallaDillavadduraa... aa... neetilaeni Saasanaalu naeTi nuMDi radduraa... aa... niduravaddu... bedaravaddu...niduravaddu... bedaravaddu... niMgi neeku hadduraa... niMgi neeku hadduraa... charaNaM : 2 O... evaDuvaaDu echaTivaaDu evaDuvaaDu echaTivaaDu iTu vachchina tellavaaDu... iTu vachchina tellavaaDu kaMDabalaM koMDaphalaM kabaLiMchae duMDageeDu... kabaLiMchae duMDageeDu maanadhanaM praaNadhanaM dOchukunae doMgavaaDu... dOchukunae doMgavaaDu evaDuvaaDu echaTivaaDu iTu vachchina tellavaaDu tagina Saasti cheyyaraa... tagina Saasti cheyyaraa tarimi tarimi koTTaraa... tarimi tarimi koTTaraa teluguveera laevaraa deekshabooni saagaraa daeSamaata svaechCha kOri tirugubaaTu chaeyaraa charaNaM : 3 ee daeSaM ee raajyaM... ee daeSaM ee raajyaM naadae ani chaaTiMchi... naadae ani chaaTiMchi pratimanishi toDalugoTTi SRMkhalaalu pagulagoTTi... SRMkhalaalu pagulagoTTi churakattulu padunubaTTi tudi samaraM modalubeTTi... tudi samaraM modalubeTTi siMhaalai garjiMchaali... siMhaalai garjiMchaali saMhaaraM saagiMchaali... saMhaaraM saagiMchaali vaMdaemaataraM... vaMdaemaataraM... vaMdaemaataraM... vaMdaemaataraM... O... O... svaataMtyraveeruDaa! svaraajyabhaanuDaa! alloori seetaaraamaraajaa! alloori seetaaraamaraajaa! svaataMtyraveeruDaa! svaraajyabhaanuDaa! alloori seetaaraamaraajaa! alloori seetaaraamaraajaa! aMdukO maa poojalaMdukO raajaa aMdukO maa poojalaMdukO raajaa alloori seetaaraamaraajaa! alloori seetaaraamaraajaa! O... tellavaari guMDellO niduriMchinavaaDaa! maa niduriMchina paurushaagni ragiliMchinavaaDaa! tellavaari guMDellO niduriMchinavaaDaa! maa niduriMchina paurushaagni ragiliMchinavaaDaa! tyaagaalae varistaaM kashTaalae bharistaaM tyaagaalae varistaaM kashTaalae bharistaaM niSchayamuga... nirbhayamuga... nee veMTane naDustaaM... niSchayamuga... nirbhayamuga... nee veMTane naDustaaM... nee veMTane naDustaaM... Click here to hear the song
పల్లవి : ఓహో... హో... ఓహోహో... ఓ... ఓ.... తెలుగువీర లేవరా... ఆ... దీక్షబూని సాగరా.... ఆ... తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా చరణం : 1 దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ... నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ... దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ... నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ... నిదురవద్దు... బెదరవద్దు...నిదురవద్దు... బెదరవద్దు... నింగి నీకు హద్దురా... నింగి నీకు హద్దురా... చరణం : 2 ఓ... ఎవడువాడు ఎచటివాడు ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు... ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండఫలం కబళించే దుండగీడు... కబళించే దుండగీడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు... దోచుకునే దొంగవాడు ఎవడువాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాస్తి చెయ్యరా... తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా... తరిమి తరిమి కొట్టరా తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా చరణం : 3 ఈ దేశం ఈ రాజ్యం... ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి... నాదే అని చాటించి ప్రతిమనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి... శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదునుబట్టి తుది సమరం మొదలుబెట్టి... తుది సమరం మొదలుబెట్టి సింహాలై గర్జించాలి... సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి... సంహారం సాగించాలి వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం... ఓ... ఓ... స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా! అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా! స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా! అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా! అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా! ఓ... తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా! మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా! తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా! మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా! త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం... నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం... నీ వెంటనె నడుస్తాం... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment