Song » Pranayamaa ne / ప్రణయమా నీ
Song Details:Actor :
Raja Shekar / రాజ శేఖర్ ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : praNayamaa neepaeraemiTi praLayamaa praNayamaa neepaeraemiTi praLayamaa gamyaM teliyani payanamaa praemaku paTTina grahaNamaa telupumaa telupumaa telupumaa praNayamaa neepaeraemiTi praLayamaa charaNaM : 1 praema kavitaa gaanamaa naa praaNamunnadi Sruti laeka gaeyamae eda gaayamainadi valapu chitini ragiliMchagaa teegachaaTuna raagamaa ee daehamunnadi jata laeka daahamaara ni snaehamai eda Sithila SiSiramai maaragaa O hRdayamaa... idi saadhyamaa... reMDuga guMDae cheelunaa iMkaa eMduku SOdhana reMDuga guMDae cheelunaa iMkaa eMduku SOdhana telupumaa telupumaa telupumaa praNayamaa neepaeraemiTi praLayamaa charaNaM : 2 praemasaagara madhanamae jarigiMdi guMDelO eevaeLa raagamannadi tyaagamainadi chivarikevarikee amRtaM teeramerugani keraTamai chelaraegu manasulO eevaeLa aSrudhaaralae aksharaalugaa anuvadiMchenaa jeevitaM O praaNamaa... idi nyaayamaa... raagaM aMTae tyaagamaa valapuku phalitaM Soonyamaa raagaM aMTae tyaagamaa valapuku phalitaM Soonyamaa telupumaa telupumaa telupumaa praNayamaa neepaeraemiTi praLayamaa Click here to hear the song
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా చరణం : 1 ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నది శ్రుతి లేక గేయమే ఎద గాయమైనది వలపు చితిని రగిలించగా తీగచాటున రాగమా ఈ దేహమున్నది జత లేక దాహమార ని స్నేహమై ఎద శిథిల శిశిరమై మారగా ఓ హృదయమా... ఇది సాధ్యమా... రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా చరణం : 2 ప్రేమసాగర మధనమే జరిగింది గుండెలో ఈవేళ రాగమన్నది త్యాగమైనది చివరికెవరికీ అమృతం తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించెనా జీవితం ఓ ప్రాణమా... ఇది న్యాయమా... రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment