Song » Kanulu vippi / కనులు విప్పి
Song Details:Actor :
Raja Shekar / రాజ శేఖర్ ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : kanulu vippi kaluva mogga jaabillini choochenO tamakaMtO paalabugga tolimuddunu kOrenO taDiyaarani pedavulapai toNikina vennela merupulu cheppakanae...cheppakanae... cheppakanae chebutunnavi idae idae praemanee (2) charaNaM : 1 chilipiga nee chaetulu aNuvaNuvu taDumutuMTae mOhapu teralika toligaenaa ahaa ahaa chali chali chirugaalulu giligiMta raeputuMTae aaSala allari aNigaenaa ahaa ahaa padaalatOnaevariMcha naa saraaga maalai tariMchanaa svaraalatOnae spRSiMchanaa sukhaala veeNa SrutiMchanaa aa vennela nee kannula raepeTTina aa kOrika pogalai segalai edalO ra gilina kshaNamae IIcheppakanaeII charaNaM : 2 tanuvunu penavaesina nee cheerakeMta garvaM yavvana girulanu taDimenanaa nee kaugiTa naliginaMdukae aMta garvaM madanuDi malupulu telisenanee tellaaraneekae vayyaaramaa allaaDipOyae ee raeyinee savaalu chaesae SRMgaaramaa saMdhiMchamaakae O haayinee aa mallela kaeriMtalu nee navvula laaliMtalu valalai alalai oDilO odigina kshaNamae IIcheppakanaeII Click here to hear the song
పల్లవి : కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెనో తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెనో తడియారని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే...చెప్పకనే... చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ (2) చరణం : 1 చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా అహా అహా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అణిగేనా అహా అహా పదాలతోనేవరించ నా సరాగ మాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణ శ్రుతించనా ఆ వెన్నెల నీ కన్నుల రేపెట్టిన ఆ కోరిక పొగలై సెగలై ఎదలో ర గిలిన క్షణమే ॥ చెప్పకనే॥ చరణం : 2 తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడి మలుపులు తెలిసెననీ తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయినీ సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయినీ ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే ॥ చెప్పకనే॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment