Song » Cheli Vinamani / చెలి వినమని
Song Details:Actor :
Naani / నాని ,Actress :
Nithya Meenan / నిత్య మీనన్ ,Music Director :
Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Hema chandra / హేమచంద్ర ,Song Category : Love & Romantic Songs
celi vinamani..ceppaali manasulO talapuni mari ivvaalE twarapaDanaa marO muhUrtaM kanabaDunaa idi epuDO modalaiMdani.. adi ipuDE telisiMdani tanakkUDaa eMtO koMta idE bhaavaM uMTuMdaa kanukkuMTE baaguMTuMdEmO aDaggaanE avunaMTuMdaa abhipraayaM lEdaMTuMdaa vissukuMTU pommaMTuMdEmO maMdaarapuvvulaa kaMdipOyi chI aMTE sigganukuMTaaM kaanI saMdEhaM tIraka muMdukeLitE mariyaadakeMtO haani idi epuDO modalaiMdani..adi ipuDE telisiMdani pilustunnaa vinapaDanaTTu paraaggaa nEnunnaTTu chiraaggaa cinabOtuMdO EmO prapaMcaMtO panilEnaTTu tadEkaMgaa cUstunnaTTu rahasyaM kanipeTTEstuMdEmO ammaayi pErulO maaya maikaM E lOkaM cUpistuMdO gaanI vayyaari UhalO vaayuvEgaM mEGaalu digiraanaMdi idi epuDO idi epuDO modalaiMdani modalaiMdani adi ippuDE adi ippuDE telisiMdani.. telisiMdani.. Click here to hear the song
చెలి వినమని..చెప్పాలి మనసులో తలపుని మరి ఇవ్వాలే త్వరపడనా మరో ముహూర్తం కనబడునా ఇది ఎపుడో మొదలైందని.. అది ఇపుడే తెలిసిందని తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉంటుందా కనుక్కుంటే బాగుంటుందేమో అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా విస్సుకుంటూ పొమ్మంటుందేమో మందారపువ్వులా కందిపోయి చీ అంటే సిగ్గనుకుంటాం కానీ సందేహం తీరక ముందుకెళితే మరియాదకెంతో హాని ఇది ఎపుడో మొదలైందని..అది ఇపుడే తెలిసిందని పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్నట్టు చిరాగ్గా చినబోతుందో ఏమో ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు రహస్యం కనిపెట్టేస్తుందేమో అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గానీ వయ్యారి ఊహలో వాయువేగం మేఘాలు దిగిరానంది ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని.. తెలిసిందని.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment