Song » Chitapataa Chinukulato / చిటాపటా చినుకులతో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Krishna / కృష్ణ Actress :
Shaarada / శారద ,
Showkar Janaki, / షావుకారు జానకి ,
Vijayanirmala / విజయనిర్మల Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల Song Category : Others
pallavi: ciTApaTA cinukulatO kurisiMdi vAna merisiMdi jANa ||2|| ciTApaTA cinukulatO taLAtaLA merupulatO merisiMdi paina urimiMdi lOna ||2|| taLAtaLA merupulatO caraNaM 1: vaccE vaccE vAnajallu... vaccE vaccE vAnajallu jallu kAdadi poMgivaccu paDucudanaM varadalE adi jallu kAdadi poMgivaccu paDucudanaM varadalE adi varada kAdadi AgalEni cilipitanaM vAgulE adi nI vEgamE idi kurisiMdi vAna merisiMdi jANa... ciTApaTA cinukulatO kurisiMdi vAna merisiMdi jANa ciTApaTA cinukulatO caraNaM 2: nallamabbu tellamabbu muddulADukunnavi cukkalanni cIkaTlO musugu kappukunnavi nallamabbu tellamabbu muddulADukunnavi cukkalanni cIkaTlO musugu kappukunnavi ullipora cIra taDisi oMTikaMTukunnadi ullipora cIra taDisi oMTikaMTukunnadi taLAtaLA merupulatO merisiMdi paina urimiMdi lOna taLAtaLA merupulatO caraNaM 3: merise merise reMDu kaLlu merise merise reMDu kaLlu kaLlu kAvavi manasulOki tericina vAkiLLulE avi kaLlu kAvavi manasulOki tericina vAkiLLulE avi vAkiLLu kAvavi valapu tEnelUrE rasaguLlulE avi selayELlulE ivi merisiMdi paina urimiMdi lOna taLAtaLA merupulatO merisiMdi paina urimiMdi lOna ciTApaTA cinukulatO kurisiMdi vAna merisiMdi jANa ciTApaTA cinukulatO Click here to hear the song
పల్లవి: చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ 2 చిటాపటా చినుకులతో తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన 2 తళాతళా మెరుపులతో చరణం 1: వచ్చే వచ్చే వానజల్లు... వచ్చే వచ్చే వానజల్లు జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం వరదలే అది వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే ఇది కురిసింది వాన మెరిసింది జాణ... చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ చిటాపటా చినుకులతో చరణం 2: నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన తళాతళా మెరుపులతో చరణం 3: మెరిసె మెరిసె రెండు కళ్లు మెరిసె మెరిసె రెండు కళ్లు కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే ఇవి మెరిసింది పైన ఉరిమింది లోన తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ చిటాపటా చినుకులతో ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment