Song » Na Jevata Gamanamlo / నా జీవిత గమనములో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Ambika / అంబిక ,Music Director :
Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer :
Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category :
pallavi : naa jeevita gamanamulO oka naayika puTTiMdi (2) adi oohala lOkamulO kavitalu raastuMdi aa kavita kaavyamai kaavyaaniki naayikavai variMchi tariMchi ooriMchakaraavae kaavyanaayika IIjeevitaII charaNaM : 1 naenu kavini kaanu kavita raayalaenu Silpini kaanu ninu teerchididdalaenu chitrakaaruni kaanae kaanu gaayakuNNi asalae kaanu aemeekaani naenu ninu kolichae poojaarini nee guMDela guDilO pramidanu peTTae poojaarini nee praema poojaarini IIjeevitaII charaNaM : 2 naenu raamuNni kaanu villu virachalaenu vishNuNni kaanu ninu ettuku pOlaenu chaMduruNni kaanae kaanu iMduruNni asalae kaanu evaroo kaani naenu ninu kolichae nirupaedanu anuraagapu divvelu chamurunu niMpae oka paedanu nae nirupaedanu IIjeevitaII
పల్లవి : నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది (2) అది ఊహల లోకములో కవితలు రాస్తుంది ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై వరించి తరించి ఊరించకరావే కావ్యనాయిక ॥జీవిత॥ చరణం : 1 నేను కవిని కాను కవిత రాయలేను శిల్పిని కాను నిను తీర్చిదిద్దలేను చిత్రకారుని కానే కాను గాయకుణ్ణి అసలే కాను ఏమీకాని నేను నిను కొలిచే పూజారిని నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే పూజారిని నీ ప్రేమ పూజారిని ॥జీవిత॥ చరణం : 2 నేను రాముణ్ని కాను విల్లు విరచలేను విష్ణుణ్ని కాను నిను ఎత్తుకు పోలేను చందురుణ్ని కానే కాను ఇందురుణ్ని అసలే కాను ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను అనురాగపు దివ్వెలు చమురును నింపే ఒక పేదను నే నిరుపేదను ॥జీవిత॥
0 comments:
Post a Comment