Monday, July 27, 2020

Adavi Ramudu » Krishi unte Manushulu      అడవి రాముడు » కృషి ఉంటే మనుషులు

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Krishi unte Manushulu / కృషి ఉంటే మనుషులు

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jayaprada / జయప్రద ,  Jayasudha / జయసుధ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
saakee :

 manishai puTTinavaaDu kaaraadu maTTibomma

 paTTudalae uMTae kaagalaDu marObrahma

 pallavi :

 kRshi uMTae manushulu Rshulautaarumahaapurushulautaaru

 tarataraalaki taragani velugautaaru ilavaelupulautaaru charaNaM : 1

 aDugO ataDae vaalmeeki bratuku vaeTa ataniki

 atibhayaMkaruDu yamakiMkaruDu

 aDavi jaMtulapaaliTi aDugO ataDae vaalmeeki

 paalapiTTala jaMTa valapu taenela paMTa

 paMDiMchukuni paravaSiMchi pOyaevaeLa

 aa pakshula jaMTaku guripeTTaaDu

 oka pakshini naela koolchaaDu

 jaMTa baasina pakshi kaMTa poMgina gaMga

 tana kaMTilO poMga manasu karagaMga

 aa SOkaMlO oka SlOka M palikae aa cheekaTi edalO deepaM veligae

 karaku bOyaDae aMtariMchagaa kavigaa aataDu avatariMchagaa

 manishi atanilO maelkonnaaDu kaDaku maharshae ayinaaDu

 navarasabharitaM raamuni charitaM jagatiki aataDu paMchina amRtaM

 aa vaalmeeki meevaaDu meelOnae unnaaDu

 aksharamai mee manasu veligitae meelOnae uMTaaDu

 aMdukae...

 kRshi uMTae manushulu Rshulautaaru mahaapurushulautaaru

 tarataraalaki taragani velugautaaru ilavaelupulautaaru charaNaM : 2

 aekalavyuDaMTaenae edurulaeni baaNaM

 tirugulaeni deekshakee ataDae praaNaM

 kulaM takkuva ni vidyanaerpani guruvu bommagaa migilaaDu

 bomma guruvugaa chaesukoni baaNa vidyalO perigaaDu

 huTaahuTini drONuDapuDu taTaalumani taralivachchi

 pakshapaata buddhitO dakshiNa immannaaDu

 eduTa nilichina guruni padamaMTi

 aemivvagalavaaDananae aekalavyuDu

 boTanavraelivvamane kapaTi aa drONuDu

 valleyane SishyuDu chelle drONuni muDupu

 erukalavaaDu ayitaenaemi gurikala vaaDae monagaaDu

 vaelunichchi tana villunu viDichi

 vaelupugaa ila veligaaDu

 aMdukae...

 kRshi uMTae manushulu Rshulautaaru mahaapurushulautaaru

 tarataraalaki taragani velugautaaru ilavaelupulautaaru charaNaM : 3

 Sabaree... iMtakaalamu vaechinadi ee pilupukae Sabari

 aaSa karuviDi aDugu taDabaDi raamapaadamu kannadi

 vaMgipOyina naDumutO nagumOmu chooDagalaeka apuDu

 kanula neeriDi aa raamapaadamu kaDiginadi Sabari

 padamula originadi Sabari

 praema meeraga raamuDappuDu Sabari talli kanulu tuDichi

 kOrikOri Sabari korikina dOra paMDlanu aaragiMche

 aame eMgili gaMga kanna minnaga bhaaviMchina

 raghuraamuDeMtaTi dhanyuDO

 aa SabarideMtaTi puNyamO

 aame evvarO kaadu sumaa aaDabaDuchu mee jaatiki

 jaatiratnamulu eMdareMdarO meelO kalaree naaTikee

 aDivini puTTi perigina kathalae akhila bhaaratiki haaratulu

 naagarikatalO saagu charitalO meerae maaku saarathulu

 aMdukae...

 kRshi uMTae manushulu Rshulautaaru mahaapurushulautaaru

 tarataraalaki taragani velugautaaru ilavaelupulautaaru


 
Click here to hear the song
సాకీ :

 మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ

 పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ

 పల్లవి :

 కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు

 తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు చరణం : 1

 అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి

 అతిభయంకరుడు యమకింకరుడు

 అడవి జంతులపాలిటి అడుగో అతడే వాల్మీకి

 పాలపిట్టల జంట వలపు తేనెల పంట

 పండించుకుని పరవశించి పోయేవేళ

 ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు

 ఒక పక్షిని నేల కూల్చాడు

 జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ

 తన కంటిలో పొంగ మనసు కరగంగ

 ఆ శోకంలో ఒక శ్లోక ం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే

 కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా

 మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు

 నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం

 ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు

 అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు

 అందుకే...

 కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

 తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు చరణం : 2

 ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం

 తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం

 కులం తక్కువ ని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు

 బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు

 హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి

 పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు

 ఎదుట నిలిచిన గురుని పదమంటి

 ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు

 బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు

 వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు

 ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు

 వేలునిచ్చి తన విల్లును విడిచి

 వేలుపుగా ఇల వెలిగాడు

 అందుకే...

 కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

 తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు చరణం : 3

 శబరీ... ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి

 ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది

 వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు

 కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి

 పదముల ఒరిగినది శబరి

 ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి

 కోరికోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించె

 ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన

 రఘురాముడెంతటి ధన్యుడో

 ఆ శబరిదెంతటి పుణ్యమో

 ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి

 జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ

 అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు

 నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు

 అందుకే...

 కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు

 తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment