Monday, July 27, 2020

Adavi Ramudu » Kokilamma Pelliki      అడవి రాముడు » కోకిలమ్మ పెళ్ళికి

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Kokilamma Pelliki / కోకిలమ్మ పెళ్ళికి

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jayaprada / జయప్రద ,  Jayasudha / జయసుధ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Occassional Songs
kukukuku..kukukuku..
kOkilamma peLLiki kOnaMtaa paMdirI..
ciguraakulu tOraNaalu cirugaali sannaayu!!



DuDuMDuDuM..DuDuMDuDuM..
vasaMtuDE peLLikoDuku vanamaMtaa saMdaDI..
pUlannI talaMbraalu punnamI tolirERyi!!



tuLLi tuLLi ninna monna tUnigallE egirina pilladaani kocciMdI kaLaa..peLLi kaLaa..
talapulannI valapulaina cUpulu viri tUpulaina peLLikoDuku navvitE kala..taLa taLa!!



pUlagaalitO rEgina puppoDi paaraaNigaa..
cilaka paaTa nemali aaTa kalisI mEjuvaaNigaa!!



pUlagaalitO rEgina puppoDi paaraaNigaa..
cilaka paaTa nemali aaTa kalisI mEjuvaaNigaa!!



aMdamaina peLLiki aMdaru pEraMTaalE..
aDavilOni vaagulannI aanaMdapu keraTaalE!!



kukukuku..kukukuku..
kOkilamma peLLiki kOnaMtaa paMdirI..
ciguraakulu tOraNaalu cirugaali sannaayu!!



kannu kannu kalupukunna kanne manasu telusukunna kanula nIli nIDalE katha..prEma katha,,A
buggalalO niggudIsi siggulalO cilariMci mogga valapu viccitE katha..peLLi katha



irumanasulakoka tanuvai..iru tanuvulakoka manuvai..
manasulOni valapulannI mallela viri paanupulai!!



irumanasulakoka tanuvai..iru tanuvulakoka manuvai..
manasulOni valapulannI mallela viri paanupulai!!



kalisi vunna nUrELLu..kalaluganna veyyELLu..
mUDu muLLu paDina naaDu edalu pUla podariLLu!!



kukukuku..kukukuku..
kOkilamma peLLiki kOnaMtaa paMdirI..
ciguraakulu tOraNaalu cirugaali sannaayu!!



DuDuMDuDuM..DuDuMDuDuM..
vasaMtuDE peLLikoDuku vanamaMtaa saMdaDI..
pUlannI talaMbraalu punnamI tolirERyi!!



 
 
Click here to hear the song
కుకుకుకు..కుకుకుకు..
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ..
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయు!!



డుడుండుడుం..డుడుండుడుం..
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ..
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి!!



తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తూనిగల్లే ఎగిరిన పిల్లదాని కొచ్చిందీ కళా..పెళ్ళి కళా..
తలపులన్నీ వలపులైన చూపులు విరి తూపులైన పెళ్ళికొడుకు నవ్వితే కల..తళ తళ!!



పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా..
చిలక పాట నెమలి ఆట కలిసీ మేజువాణిగా!!



పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా..
చిలక పాట నెమలి ఆట కలిసీ మేజువాణిగా!!



అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే..
అడవిలోని వాగులన్నీ ఆనందపు కెరటాలే!!



కుకుకుకు..కుకుకుకు..
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ..
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయు!!



కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న కనుల నీలి నీడలే కథ..ప్రేమ కథ,,ఆ
బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలరించి మొగ్గ వలపు విచ్చితే కథ..పెళ్ళి కథ



ఇరుమనసులకొక తనువై..ఇరు తనువులకొక మనువై..
మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై!!



ఇరుమనసులకొక తనువై..ఇరు తనువులకొక మనువై..
మనసులోని వలపులన్నీ మల్లెల విరి పానుపులై!!



కలిసి వున్న నూరేళ్ళు..కలలుగన్న వెయ్యేళ్ళు..
మూడు ముళ్ళు పడిన నాడు ఎదలు పూల పొదరిళ్ళు!!



కుకుకుకు..కుకుకుకు..
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ..
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయు!!



డుడుండుడుం..డుడుండుడుం..
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ..
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి!!






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment