Song » Kallalo Pelli pandiri / కళ్ళలో పెళ్ళి పందిరి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vanisree / వాణిశ్రీ ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
sUryaM : kaLLalO peLLi paMdiri kanabaDasAgE pallakilOna vUrEgE muhUrtaM madilO kadalADE jaya: kaLLalO peLLipaMdiri kanabaDasAge pallakilOna vUrEgE muhUrtaM madilO kadalADE sUryaM: nuduTa kaLyANa tilakamutO pasupupArANi padamulatO pedavipai medilE nagavulatO vadhuvu nanu Oraga cUstUMTE jIvitAna... pUlavAna ||kaLLalO|| jaya: sannAyi callagA mrOgi pannITi jallulE rEgi manasaina varuDu darijEri meDalOna tALikaDutuMTE jEvitAna.... pUlavAna ||kaLLalO|| sUryaM: valapu hRudayAlu pulakariMci jaya: madhura svapnAlu PaliyiMci sUryaM: lOkamE vennela velugaitE jaya: BAviyE naMdanavanamaitE sUryaM: jIvitAna jaya: pUlavAna ||kaLLalO|| Click here to hear the song
సూర్యం : కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే పల్లకిలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే జయ: కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగె పల్లకిలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే సూర్యం: నుదుట కళ్యాణ తిలకముతో పసుపుపారాణి పదములతో పెదవిపై మెదిలే నగవులతో వధువు నను ఓరగ చూస్తూంటే జీవితాన... పూలవాన ||కళ్ళలో|| జయ: సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి మనసైన వరుడు దరిజేరి మెడలోన తాళికడుతుంటే జేవితాన.... పూలవాన ||కళ్ళలో|| సూర్యం: వలపు హృదయాలు పులకరించి జయ: మధుర స్వప్నాలు ఫలియించి సూర్యం: లోకమే వెన్నెల వెలుగైతే జయ: భావియే నందనవనమైతే సూర్యం: జీవితాన జయ: పూలవాన ||కళ్ళలో|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment