Saturday, July 11, 2020

Aathmeeyulu » Amma baabo      ఆత్మీయులు » అమ్మబాబొ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Amma baabo / అమ్మబాబొ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
jaya; ammabAbo   nammarAdU I rAlugAyi
    abbAyila nammarAdu
    prEmiMcAmaMTAru peddaga cebutuMTAru
    peLLimATa ettagAnE callaga digajArutAru
sUryaM: ammabAbo   nammarAdU I rAlugAyi
    abbAyila nammarAdu
    Dabbulunna kurrAvALLa Takkuna paTTEstAru
    lav  myArEjI aMTU lagnaM peTTistAru             ||amma||
jaya: kaTnAlu perugunani kAlEjikeLatAru
    hAjaru paTTIvEsi gairu hAjarautAru
    mArkulakOsaM taMDrula tIrdhayAtra tipputAru
    iMjanIrlu DAkTarlayi yika cUskOmaMTAru      ||amma||
sUryaM: varaMDAlalOna jEri vAlcUpulu visurutAru
    sinimAlu ShikArlaMTu snEhaM peMcEstAru
    taLakubeLuku kulukulatO paiTa ceMgurApulatO
    ciTikelOna abbAyila ceMguna muDivEstAru     ||amma||
jaya:  Astivunna pillayitE aMdaM jOlikipOru
    kuMTidaina kurUpaina peLLiki yassaMTAru
sUryaM: peLLiyaina marnADE SrIvArini cEtabaTTi
    bayaTiki attamAmala dayacEMDaMTAru ||amma||
sUryaM: dimmadirigi EmiTalA tellamogaM vEstAvu
jaya: valapu dAcukuni eMduku mATalu dulipEstAvu
iddarU: manasu manasu telusukuMdAmU
ikanainA jalasAgA kalisivuMdAmu                       ||manasu||
జయ;  అమ్మబాబొ   నమ్మరాదూ ఈ రాలుగాయి
    అబ్బాయిల నమ్మరాదు
    ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు
    పెళ్ళిమాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు
సూర్యం: అమ్మబాబొ   నమ్మరాదూ ఈ రాలుగాయి
    అబ్బాయిల నమ్మరాదు
    డబ్బులున్న కుర్రావాళ్ళ టక్కున పట్టేస్తారు
    లవ్  మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు             ||అమ్మ||
జయ: కట్నాలు పెరుగునని కాలేజికెళతారు
    హాజరు పట్టీవేసి గైరు హాజరౌతారు
    మార్కులకోసం తండ్రుల తీర్ధయాత్ర తిప్పుతారు
    ఇంజనీర్లు డాక్టర్లయి యిక చూస్కోమంటారు      ||అమ్మ||
సూర్యం: వరండాలలోన జేరి వాల్చూపులు విసురుతారు
    సినిమాలు షికార్లంటు స్నేహం పెంచేస్తారు
    తళకుబెళుకు కులుకులతో పైట చెంగురాపులతో
    చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు     ||అమ్మ||
జయ:  ఆస్తివున్న పిల్లయితే అందం జోలికిపోరు
    కుంటిదైన కురూపైన పెళ్ళికి యస్సంటారు
సూర్యం: పెళ్ళియైన మర్నాడే శ్రీవారిని చేతబట్టి
    బయటికి అత్తమామల దయచేండంటారు ||అమ్మ||
సూర్యం: దిమ్మదిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
జయ: వలపు దాచుకుని ఎందుకు మాటలు దులిపేస్తావు
ఇద్దరూ: మనసు మనసు తెలుసుకుందామూ
ఇకనైనా జలసాగా కలిసివుందాము                       ||మనసు||

0 comments:

Post a Comment