Monday, July 6, 2020

Aathma Balam » Gilli kajjalu ఆత్మ బలం » గిల్లి కజ్జాలు

July 06, 2020 Posted by Publisher , No comments


Song » Gilli kajjalu / గిల్లి కజ్జాలు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  Song Category : Love & Romantic Songs
gilli kajjaalu teccukunE ammaayi

nI kaLLallO unnadi bhalE baDaayi

gilli kajjaalu teccukunE ammaayi

nI kaLLallO unnadi bhalE baDaayi

bulli kaarunna ShOkilaa abbaayi

nI POjullO unnadi bhalE baDaayi



vayasutOTi dOra dOra sogasulostaayi

sogasulatO Ora Ora cUpulostaayi 

vayasutOTi dOra dOra sogasulostaayi

sogasulatO Ora Ora cUpulostaayi 

cUpulatO lEni pOni gIralostaayi

aa gIralannI jaaripOvu rOjulostaayi



bulli kaarunna ShOkilaa abbaayi

nI kaLLallO unnadi bhalE baDaayi



kurrakaaru kOrikalu gurraalavaMTivi

kaLLalu vadilitE kadaM tokkutaayi

paTTu tappinaMtanE paruvE tIstaayi

oLLu daggaruMcukuMTE maMcidabbaayi



gilli kajjaalu teccukunE ammaayi

nI kaLLallO unnadi bhalE baDaayi



modaTa modaTa kaLLatOTi modalupeTTi laDaayi

hRudayamaMtaa paakutuMdi huShaaraina haayi

modaTa modaTa kaLLatOTi modalupeTTi laDaayi

hRudayamaMtaa paakutuMdi huShaaraina haayi

kalakaalaM uMDadu I paDacu baDaayi

tolinaaDE callabaDi pOvunammaayi



bulli kaarunna ShOkilaa abbaayi

nI POjullO unnadi bhalE baDaayi



kaLLu cUsi mOsapOyi kalavariMcaku 

OracUpu kOracUpu okaTanukOku

istEnu hRudayameMtO mettanainadi

edurutirigitE adE katti vaMTidi



gilli kajjaalu teccukunE ammaayi

nI kaLLallO unnadi bhalE baDaayi

bulli kaarunna ShOkilaa abbaayi

nI POjullO unnadi bhalE baDaayi
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి

నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి



వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి

సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి 

వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి

సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి 

చూపులతో లేని పోని గీరలొస్తాయి

ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి



బుల్లి కారున్న షోకిలా అబ్బాయి

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి



కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి

కళ్ళలు వదిలితే కదం తొక్కుతాయి

పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి

ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయి



గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి



మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి

హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి

మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి

హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి

కలకాలం ఉండదు ఈ పడచు బడాయి

తొలినాడే చల్లబడి పోవునమ్మాయి



బుల్లి కారున్న షోకిలా అబ్బాయి

నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి



కళ్ళు చూసి మోసపోయి కలవరించకు 

ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు

ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది

ఎదురుతిరిగితే అదే కత్తి వంటిది



గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి

నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి

నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి

0 comments:

Post a Comment