Sunday, July 19, 2020

Aarya » Edo Priyaragam      ఆర్య » ఏదో ప్రియరాగం

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Edo Priyaragam / ఏదో ప్రియరాగం

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Anu Mehta / అను మెహతా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sagar / సాగర్ ,  Sumangali / సుమంగళి ,Song Category : Love & Romantic Songs
EdO priyaraagaM viMTunnaa cirunavvullO 

prEmaa aa saMdaDi nIdEnaa

EdO nava naaTyaM cUstunnaa sirumuvvallO

prEmaa aa savvaDi nIdEnaa

iTTaagE kalakaalaM cUDaalanukuMTunnaa

iTupaina I swapnaM karigiMcaku Emainaa

prEmaa O prEmaa cirakaalaM naaveMTE

nuvvaMTE nijamEgaa swapnaM

nuvvuMTE prati maaTa satyaM

nuvvuMTE manasaMtaa EdO tiyyani saMgItaM

nuvvuMTE prati aDugu aMdaM

nuvvuMTE prati kShaNamu swargaM

nuvvuMTE ika jIvitamaMtaa EdO saMtOShaM



O..paaTa paaDadaa maunaM purivippi aaDadaa praaNaM

aDavinainaa pUdOTa cEyadaa prEmabaaTalO payanaM

daaricUpadaa shUnyaM aracEta vaaladaa swargaM

elladaaTi paravaLLu tokkadaa velluvaina aaMdaM

prEmaa nI saavaasaM naa shwaasaku saMgItaM

prEmaa nI saannidhyaM naa Uhala saamraajyaM

prEmaa O.. prEmaa guMDellO kalakaalaM



nuvvuMTE prati aasha soMtaM 

nuvvuMTE cirugaalE gaMdhaM

nuvvuMTE eMDainaa kaadaa callani saayaMtraM

nuvvuMTE prati maaTaa vEdaM

nuvvuMTE prati paluku raagaM

nuvvuMTE cirunavvulatOnE niMDenu I lOkaM



unnacOTa unnaanaa aakaashamaMdukunnaanaa

celiyalOni I kotta saMbaram naaku rekka tODigEnaa

munigi tElutunnaanaa I muccaTaina muripaana

aamelOni aanaMda saagaraM nannu muMcu samayaana

harivillE nannallE I raMgulu nIvallE

sirimallela vaagallE I vennela nI vallE

prEmaa O.. prEmaa idi shaashwatamanukOnaa



nuvvuMTE digulaMTU raadE

nuvvuMTE velugaMTu pOdE

nuvvuMTE mari maaTalu kUDaa paaTaipOtaayE

nuvvuMTE eduraMTU lEdE

nuvvuMTE alupaMTU raadE

nuvvuMTE E kaShTaalainaa eMtO iShTaalE

 





Click here to hear the song
ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో 

ప్రేమా ఆ సందడి నీదేనా

ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరుమువ్వల్లో

ప్రేమా ఆ సవ్వడి నీదేనా

ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా

ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా

ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వంటే నిజమేగా స్వప్నం

నువ్వుంటే ప్రతి మాట సత్యం

నువ్వుంటే మనసంతా ఏదో తియ్యని సంగీతం

నువ్వుంటే ప్రతి అడుగు అందం

నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం

నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం



ఓ..పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం

అడవినైనా పూదోట చేయదా ప్రేమబాటలో పయనం

దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం

ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆందం

ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం

ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం

ప్రేమా ఓ.. ప్రేమా గుండెల్లో కలకాలం



నువ్వుంటే ప్రతి ఆశ సొంతం 

నువ్వుంటే చిరుగాలే గంధం

నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం

నువ్వుంటే ప్రతి మాటా వేదం

నువ్వుంటే ప్రతి పలుకు రాగం

నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం



ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా

చెలియలోని ఈ కొత్త సంబరమ్ నాకు రెక్క తోడిగేనా

మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన

ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన

హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే

సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీ వల్లే

ప్రేమా ఓ.. ప్రేమా ఇది శాశ్వతమనుకోనా



నువ్వుంటే దిగులంటూ రాదే

నువ్వుంటే వెలుగంటు పోదే

నువ్వుంటే మరి మాటలు కూడా పాటైపోతాయే

నువ్వుంటే ఎదురంటూ లేదే

నువ్వుంటే అలుపంటూ రాదే

నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment