Tuesday, July 21, 2020

Aapdbandhavudu » Oura Ammaka Chella      ఆపద్బాంధవుడు » ఔరా అమ్మక చెల్ల

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Oura Ammaka Chella / ఔరా అమ్మక చెల్ల

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Meenakshi Seshadri / మీనాక్షి శేషాద్రి ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

aurA ammaka cella AlakiMci nammaTamellA

aurA ammaka cella AlakiMci nammaTamellA

aMta viMtagAdhallO AnaMdalAla

bApurE brahmakucellA vainamaMta valliMcavellA

rEpalle vADallO AnaMda lIla

ayinavADE aMdariki ayinA aMdaDu evvariki (2)

bAluDA gOpAluDA lOkAla pAluDA

telisEdi elA elA cAMguBaLA

telisEdi elA elA cAMguBaLA

aurA ammakacellA AlakiMci nammaTamellA 

aMta viMtagAdhallO AnaMdalAla
caraNaM : 1

nallarAti kaMDalatO karukainavADE

vennamudda guMDelatO karuNiMcu tODE

nallarAti kaMDalatO karukainavADE AnaMdalAla

vennamudda guMDelatO karuNiMcu tODE AnaMdalIla

AyudhAlu paTTanu aMTU bAva baMDi tOlipeTTE AnaMdalAla

jANa jAna padAlatO  j~jAnanIti palukunaTE AnaMdalIla

bAluDA gOpAluDA lOkAla pAluDA

telisEdi elA elA cAMguBaLA

aurA ammaka cella AlakiMci nammaTamellA 

aMta viMtagAdhallO AnaMdalAla

bApurE brahmakucellA vainamaMta valliMcavellA

rEpalle vADallO AnaMda lIla
caraNaM : 2

AlamaMda kAparilA kanipiMcalEdA AnaMdalAla

AlamaMdu kALuDilA anupiMcu kAdA AnaMdalIla

vElitO koMDanu ettE koMDaMta vElu paTTE AnaMdalAla

tulasi daLAnikE tElipOyi tUgunaTE AnaMdalIla

bAluDA gOpAluDA lOkAla pAluDA 

telisEdi elA elA cAMguBaLA

A^^A aurA ammaka cella AlakiMci nammaTamellA 

aMta viMtagAdhallO AnaMdalAla

bApurE brahmakucellA vainamaMta valliMcavellA 

rEpalle vADallO AnaMda lIla
పల్లవి:

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా

అంత వింతగాధల్లో ఆనందలాల

బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీల

అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి (2)

బాలుడా గోపాలుడా లోకాల పాలుడా

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మటమెల్లా 

అంత వింతగాధల్లో ఆనందలాల
చరణం : 1

నల్లరాతి కండలతో కరుకైనవాడే

వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే

నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల

వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల

ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల

జాణ జాన పదాలతో  జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాల పాలుడా

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా 

అంత వింతగాధల్లో ఆనందలాల

బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా

రేపల్లె వాడల్లో ఆనంద లీల
చరణం : 2

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల

ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల

తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాల పాలుడా 

తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఆఆ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మటమెల్లా 

అంత వింతగాధల్లో ఆనందలాల

బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా 

రేపల్లె వాడల్లో ఆనంద లీల

0 comments:

Post a Comment