Monday, July 20, 2020

Aanandam » Kanulu terachinaa      ఆనందం » కనులు తెరచినా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kanulu terachinaa / కనులు తెరచినా

Song Details:Actor : Aakash / ఆకాష్ ,Actress : Rekha / రేఖ ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mallikarjun / మల్లికార్జున్ ,  Sumangali / సుమంగళి ,Song Category : Others
kanulu teracinA kanulu mUsinA kalalu AgavElA
nijamu telisinA kalani ceppinA manasu nammadElA 
eduTE epuDU tirigE velugA
idigO ipuDE cUSA sarigA
innALLU nEnunnadi naDirEyi niduralOna
ayitE nAkInADE tolipoddu jADa telisiMdA  kottagA        ||A||kanulu||
pedavullO I darahasaM
nIkOsaM pUsiMdi
nI jatalO I saMtOShaM paMcAlani pistOMdi
a: eMdukanO madi nI kOsaM ArATaM paDutOMdi
ayitEnEM A alajaDilO oka AnaMdaM uMdi
A: dUraM bahucitramani
lOkaM anukuMTuMdi
kAnI A dUramE ninnu daggara cEsiMdi
a: nIlO nA prANaM uMdani
ipuDEgA telisiMdi
nItO adi ceppiMdA
I  jNApakAle nA Upirainavani                         A:||kanulu||
a: prati nimuShaM nA talapaMtA
nI cuTTU tirigiMdi
evarainA kanipeDatArani
kaMgArugA uMTOMdi
A: nA hRudayaM  nI  UhalatO
tega urakalu vEstOMdI
nAkkUDA  I kalavaramipuDE paricayamayyiMdi
a: addaMlO  nA badulU are nuvyE kanipiMcAvE
nEnE yika lEnaTTu nI lOkarigiMcAvE
A: prEmA I  kotta svaramani anumAnaM kaligiMdi
nuvvE nA  saMdEhAniki  veccanaina RujuviyyamaMdi  mari
a: kanulu terici                                               A: ||eduTE epuDU||
a: innALLu nEnunnadi     naDirEyi niduralOna
A: ayitE nAkInADE tolipoddu jADa telisiMdi kottagA
 


Click here to hear the song
కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా 
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా  కొత్తగా        ||ఆ||కనులు||
పెదవుల్లో ఈ దరహసం
నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలని పిస్తోంది
అ: ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
ఆ: దూరం బహుచిత్రమని
లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
అ: నీలో నా ప్రాణం ఉందని
ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా
ఈ  జ్ణాపకాలె నా ఊపిరైనవని                         ఆ:||కనులు||
అ: ప్రతి నిముషం నా తలపంతా
నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని
కంగారుగా ఉంటోంది
ఆ: నా హృదయం  నీ  ఊహలతో
తెగ ఉరకలు వేస్తోందీ
నాక్కూడా  ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అ: అద్దంలో  నా బదులూ అరె నువ్యే కనిపించావే
నేనే యిక లేనట్టు నీ లోకరిగించావే
ఆ: ప్రేమా ఈ  కొత్త స్వరమని అనుమానం కలిగింది
నువ్వే నా  సందేహానికి  వెచ్చనైన ఋజువియ్యమంది  మరి
అ: కనులు తెరిచి                                               ఆ: ||ఎదుటే ఎపుడూ||
అ: ఇన్నాళ్ళు నేనున్నది     నడిరేయి నిదురలోన
ఆ: అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింది కొత్తగా
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment